బోనులో చిక్కిన చిరుత | Sakshi
Sakshi News home page

బోనులో చిక్కిన చిరుత

Published Tue, Nov 14 2023 1:00 AM

- - Sakshi

తుమకూరు: మూడు రోజుల క్రితం ఓ బాలికపై దాడి చేసి గాయపరచిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. వివరాలు... తుమకూరు తాలూకా చిక్కబెళ్లావిలో ఇంటి ముందు ఆడుకుంటున్న బేఖనా అనే బాలికపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగానే చిరుత పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. ఆహారం కోసం వచ్చిన బోనులో చిక్కింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

పట్టుబడిన మరో చిరుత

మైసూరు: మైసూరు జిల్లా కేఆర్‌ నగర తాలూకా అటవీ సమీపంలోని అత్తికుప్పె గ్రామంలో గత కొన్ని రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గ్రామ పరిసరాల్లో తిరుగుతూ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ సిబ్బంది బోను ఏర్పాటు చేయగా ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది.

నేడు బన్నేరుఘట్ట జూ పార్కుకు సెలవు లేదు

బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలోని ప్రసిద్ది బన్నేరుఘట్ట ఉద్యానవనం నేడు మంగళవారం కూడా తెరిచి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మంగళవారం బన్నేరుఘట్ట ఉద్యానవనం సాధారణ సెలవు ఉంటుంది. అయితే దీపావళి సందర్భంగా శనివారం నుంచి వరుస సెలవులు ఉండటంతో బన్నేరుఘట్ట జూకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో మంగళవారం సెలవు రద్దు చేసినట్లు అధికారులు తెలి పారు. మరుసటి రోజు బుధవారం ఉద్యానవనానికి సెలవు ప్రకటించారు.

మట్టి ప్రమిదలకు భారీ డిమాండ్‌

తుమకూరు: వెలుగు పూల పండుగ దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. తుమకూరు నగరంలోని హొరపేటె, నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మార్కెట్లలో పెద్ద ఎత్తున మహిళలు మట్టి దీపాలు కొనుగోలు చేశారు.

1/1

Advertisement
 
Advertisement