మినీ లారీ ఢీ.. విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

మినీ లారీ ఢీ.. విద్యార్థిని మృతి

Published Wed, Jul 5 2023 1:24 AM

బాలిక మృతదేహం వద్ద గుమికూడిన గ్రామస్తులు  - Sakshi

హొసపేటె: పాఠశాలకు వెళుతున్న విద్యార్థినిని మినీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన మంగళవారం జిల్లా కూడ్లిగి తాలూకా అమరదేవరగుడ్డ గొల్లరహట్టి వద్ద జరిగింది. గ్రామ నివాసి జీఎస్‌.సృష్టి(8) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. ఉదయం పాఠశాలకు వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న మినీ లారీ విద్యార్థినిని బలంగా ఢీకొంది. దీంతో విద్యార్థిని సృష్టి స్థలంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకొన్న విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. కూడ్లిగి డీఎస్పీ మల్లేశప్ప మల్లాపుర, సీఐ వసంత అసోదే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement