ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ పని లేకపోవడంతో వారానికే తిరిగి వచ్చిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురిలో విషాదం నింపింది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చెరుకు రాజేశ్ (33)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబపోషణ కోసం నాలుగు నెలల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ పని లేక వారానికే ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటినుంచి నిత్యం మదనపడుతున్నాడు. అనవసరంగా డబ్బులు ఖర్చయ్యాయని భార్య, తల్లిదండ్రులతో చెబుతున్నాడు. మిత్రడి వద్దకని చెప్పి కాశెట్టి నాగరాజు ట్రావెల్స్‌కి వెళ్లాడు. షాపులో మిత్రుడు లేకపోవడంతో షాపులో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజేశ్ తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా లక్ష్మీ ప్రసాద్
కరీంనగర్‌క్రైం: సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న వేముల లక్ష్మీప్రసాద్‌ను ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్‌గా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఊత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించగా పలువురు ప్రాసిక్యూటర్లు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య


