క్రీడల్లో వర్సిటీ పేరు నిలపాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: సౌత్ ఇండియా, ఆల్ ఇండియా వర్సిటీల క్రీడల్లో శా తవాహన యూనివర్సిటీ పేరు నిలపాలని వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ కోరారు. శనివారం శాతవాహన యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో వోఎస్డీ హరికాంత్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మునావర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మ నోజ్ కుమార్, విజయకుమార్, దినేష్, నాగేశ్వరరావు, శ్రీనాథ్, సతీశ్, రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.


