14న అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ పరీక్ష
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణలోని అల్ఫోర్స్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 14న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అమోట్–2025 (అల్ఫోర్ మ్యాథ్ ఒలింపియాడ్ పరీక్ష) నిర్వహిస్తున్నట్లు అల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో శనివారం ‘అమోట్–2025’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పరీక్షకు 3 నుంచి పదో తరగతి వరకు విద్యార్తులు హాజరుకావచ్చని తెలిపారు. ప్రతీతరగతిలో మొదటి 20 స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.5వేలు, రూ.3 వేలు, రూ.2 వేలనగదు బహుమతులతోపాటు జ్ఞాపికలు అందించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 12లోగా పేర్లునమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 92469 34441, 92469 34456, 93982 30614లలో సంప్రదించాలని తెలిపారు. విజేతలకు ఈనెల 22న రామానుజన్ జయంతి ఉత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.


