స్వామియే శరణం అయ్యప్ప
మంగళవాయిద్యాలు..అభిషేక అర్చనలు.. వివిధ అలంకరణలు.. శరణు ఘోషలు.. అయ్యప్ప నామస్మరణలు..భజనల.. కీర్తనలు.. వెల్లువెత్తిన భక్తి పారవశ్యం మధ్య శనివారం కరీంనగర్ సిటీలోని మహాశక్తి ఆలయంలో మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వామి కావేటి పరమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గణపతి, కుమారస్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పెదసంఖ్యలో పాల్గొన్నారు. – కరీంనగర్‌కల్చరల్


