సాగుకు సాయంగా వచ్చేవారు | - | Sakshi
Sakshi News home page

సాగుకు సాయంగా వచ్చేవారు

Nov 2 2025 9:24 AM | Updated on Nov 2 2025 9:24 AM

  సాగ

సాగుకు సాయంగా వచ్చేవారు

సాగుకు సాయంగా వచ్చేవారు పండుగ వచ్చిందంటే.. ముచ్చటగా ఉంటది

నా యుక్త వయస్సులో ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సాగు పనులు చేసేవాళ్లం. సరదా మాట లు మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటే పని చేసినట్టు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు డబ్బుకు ప్రాఽ దాన్యం పెరిగింది. బంధుత్వాల మధ్య వైరంగా మారి బంధాలను దూరం చేసుకుంటున్నారు. డ బ్బు ప్రాధాన్యతను పక్కన బెట్టి స్నేహంగా ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. – మూగల

సంజీవరెడ్డి,రైతు, ధర్మరాజుపల్లి

ఒకప్పుడు పండుగ వచ్చిదంటే పల్లెలకు కొత్త రూపం వచ్చేది. దూ ర బంధువులు ఊరికి వచ్చారంటే కలివిడిగి తిరుగుతుండేవారు. పండుగకు వచ్చిన వారు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని సా యం చేసేవారు. ఇప్పుడు బట్టలు, బంగారంపై మోజు తప్ప పండుగలకు ప్రాధాన్యం ఇవ్వడం లే దు. ప్రస్తుత యువతకు మంచి విషయాలు చెప్పాలంటే వారు ఎలా తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంది.

– కనకం విజయ, రాంపూర్‌

మా ఇంట్లో పెద్దలు పండుగలు, పెళ్లిల్ల తంతుపై వారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆచరించిన పద్ధతి, వ్యవహారాల గురించి చెబుతుంటే ముచ్చటగా ఉంటది. అప్పట్లో ప్రతీ విషయాన్ని పక్కవారితో వారు పంచుకునే తీరు ఆశ్చర్యం వేస్తోంది. నాటి ఆచార వ్యవహారాలను నేటి యువత పాటిస్తే భవిష్యత్‌ తరాలు బాగుంటాయి.

– బండారి మహేశ్‌, తుమ్మన్నపల్లి

  సాగుకు సాయంగా  వచ్చేవారు
1
1/2

సాగుకు సాయంగా వచ్చేవారు

  సాగుకు సాయంగా  వచ్చేవారు
2
2/2

సాగుకు సాయంగా వచ్చేవారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement