
అమ్మవారికి బెండకాయల మాల
కరీంనగర్ నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారిని బెండ కాయల మాలలతో అలంకరించారు. ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. – విద్యానగర్(కరీంనగర్)
కంట్రోల్ రూం
త్వరగా పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూం భవన నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. రూ.16.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవనంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలు సమకూర్చాలని చెప్పారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయంలోని చివరి అంతస్తులో కమాండ్ కంట్రోల్‌రూం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. 350 సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారన్నారు. నగరపాలకసంస్థ, పోలీస్ అధికారులు సమన్వయంతో కంట్రోల్ రూం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో న గరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్‌డీ మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లు లచ్చిరెడ్డి, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్ స్టేషన్లు
● కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా కరీంనగర్ సర్కిల్ పరిధిలో 16 కొత్త సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. విద్యుత్ డిమాండుకనుగుణంగా అవసరమున్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజీ సమస్య ఉండకపోగా, విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధికనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ల రాకతో రైతులు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని తెలిపా రు. పొడవాటి ఫీడర్లుండవని, ఫీడర్ నష్టాలు త గ్గుతాయన్నారు. ఉన్న సబ్ స్టేషన్లపై లోడ్ భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయ సరఫరా అందించగలుగుతామని చెప్పారు. నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ఈ నూతన సబ్ స్టేషన్లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సబ్ స్టేషన్లతో నూతన వ్యవసాయ కనెక్షన్లు త్వరితగతిన మంజూరయ్యే అవకాశముంటుందన్నారు. సాగు, గృహ, వాణిజ్య అవసరాల కోసం, విని యోగదారులకు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి కొత్త సబ్ స్టేషన్లు ప్రధాన భూమిక పోషిస్తాయని స్పష్టం చేశారు. ఇందులో స్కాడ అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్న ట్లు, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని, విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందన్నారు.

అమ్మవారికి బెండకాయల మాల

అమ్మవారికి బెండకాయల మాల