
● మెటా ఫండ్‌తో మొదలై మెటాప్రో అవతారం ● ఎదురు తిరిగిన బా
బాధితులు ముందుకు రావాలి
లోకేశ్‌ను పదేపదే కరీంనగర్‌కు తీసుకువచ్చి.. మొబైల్ షాప్ యజమాని, టింబర్ డిపో ఓనర్లు రూ.కోట్లల్లో వసూలు చేశారు. ఇందుకోసం జ్యోతినగర్‌లోని ఓల్డ్ డీఐజీ కార్యాలయంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే మెటా క్రిప్టో ఆపరేట్ చేస్తున్నారు. పేరుకు క్రిప్టో కరెన్సీ అని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది మల్టీ లెవల్ మార్కెటంగ్ తరహాలోనే తమను మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధితులు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. తమకు నిందితులు ఇచ్చిన ఫ్రాంసరీ నోట్లు, చెల్లని చెక్కులు తదితరాలను ‘సాక్షి’కి పంపుతున్నారు. నేరుగా సీపీకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీపీ గౌస్ ఆలం కూడా సీరియస్‌గానే ఉన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే... తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని భరోసా ఇస్తున్నారు.