
శాకాంబరీగా అమ్మవారు
కరీంనగర్‌రూరల్: దుర్శేడ్‌లో శ్రీవిశ్వంభరీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ మరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రశాంత్‌శర్మ, శ్రీనివాస్‌శర్మ, విశాల్‌శర్మ మరకత లింగానికి విశేష అభిషేకం చేశారు. భక్తులు సమర్పించిన 108 రకాల పండ్లు, కూరగాయలు, పూలతో రాజరాజేశ్వరిదేవిని అలంకరించారు. స్వామివారు, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నందాల తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, సాయిని తిరుపతి, గౌడ నర్సయ్య పాల్గొన్నారు.