
బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను మంగళవారం ఎత్తారు. గేట్లను ఏటా జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు తెరిచి ఉంచనున్నారు. ఎగువప్రాంతాల నుంచి బాబ్లీ ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద దిగువకు రానుంది. జగిత్యాల జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్సారెస్పీలోకి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉంది. గేట్లు ఎత్తివేత కార్యక్రమంలో పోచంపహడ్, ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు గుప్తా, సీడబ్ల్యూసీ హైదరాబాద్ ఈఈ ఎంఎల్.ఫ్రాంక్లిన్, మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ ఈఈ సీఆర్.బన్సార్, పోచంపహాడ్ ఈఈ చక్రపాణి, కొత్త రవి ఉన్నారు.