
సమన్వయంతో పనిచేయాలి
కరీంనగర్‌కార్పొరేషన్: పారిశుధ్యం, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు. కళాభారతిలో ఆర్వోలు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లతో సమావేశం నిర్వహించారు. గృహావసరాలకు నిర్మించి వాణిజ్యపరంగా వాడుతున్న భవనాలను గుర్తించి వాణిజ్య ఆస్తులుగా మార్చాలన్నారు. ఇలాంటి సమస్యలతో సిటీలో 1,200 ఆస్తులు ఉన్నాయని తెలిపారు. నివాసయోగ్యమమైన ఇళ్లకు మాత్రమే నంబర్లు ఇవ్వాలని, బోగస్ ఇంటినంబర్లు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మోహియొద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్‌రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.