నవధాన్యాలు చల్లుకుంటే మేలు - | Sakshi
Sakshi News home page

నవధాన్యాలు చల్లుకుంటే మేలు

Published Sat, May 18 2024 8:35 AM

-

ఇల్లందకుంట: భూమిలో నవధాన్యాలు చల్లుకుంటే ఎంతో మేలని భారత సుస్థిర సంస్థ క్షేత్ర సహాయకుడు రావుల రాకేశ్‌ అన్నారు. శుక్రవారం ఇల్లందకుంట మండలం రాచపల్లిలో పెనుకుల దేవేందర్‌ వ్యవసాయ క్షేత్రంలో సంస్థ ఆధ్వర్యంలో నవధాన్యాలు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవధాన్యాలు వేసుకోవడం వల్ల భూమి లో సేంద్రియ కర్భనం పెరుగుతుందని తెలిపారు. గొర్రెలు, పశువుల ఎరువు, చెరువు మట్టి చల్లితే సూ క్ష్మజీవుల సంఖ్య పెరిగి, నేల సారవంతం అవుతుందని పేర్కొన్నారు. వరి కొయ్యకాలును కాల్చడం వ ల్ల భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయ ని, కాల్చకుండా నేలలోనే కలియదున్నాలని సూచించారు. సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement