అట్టహాసంగా లయన్స్‌క్లబ్‌ మల్టికాన్‌ | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా లయన్స్‌క్లబ్‌ మల్టికాన్‌

Published Sat, May 18 2024 5:50 AM

అట్టహాసంగా లయన్స్‌క్లబ్‌ మల్టికాన్‌

కరీంనగర్‌టౌన్‌: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల లయన్స్‌ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం ‘మల్టికాన్‌’ శుక్రవారం స్థానిక ప్రతిమ మల్టీప్లెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. కౌన్సిల్‌ చైర్మన్‌ తీగల మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ గట్టమనేని బాబురావు, గ్యాట్‌ఏరియా లీడర్‌ సునీల్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కంటి ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న సేవలు, మీల్స్‌ ఆన్‌ వీల్స్‌ ద్వారా అందిస్తున్న అన్నదాన కార్యక్రమాలు ప్రజలకు మరింత దగ్గర కావాలని సూచించారు. అనంతరం 2024–25 సంవత్సరానికి రెండు రాష్ట్రాల ఉమ్మడి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా హన్మండ్ల రాజిరెడ్డి, వైస్‌చైర్మన్‌గా కె.హరీశ్‌రెడ్డి, సెక్రటరీగా ఎస్‌.వెంకటేశ్వర్‌రావు, కోశాధికారిగా రేసు మల్లారెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా శివప్రసాద్‌ను నియమించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement