ప్రాణం తీసిన పాతకక్షలు | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పాతకక్షలు

Published Sat, May 18 2024 5:50 AM

ప్రాణ

ఇంటి కొనుగోలు విషయంలో వివాదం

కర్రలు, ఇనుపరాడ్‌లతో దాడి

ఘటన స్థలంలో ఒకరు.. చికిత్స పొందుతూ మరొకరు మృతి

బుగ్గారం(ధర్మపురి): పాతకక్షలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఇంటి కొనుగోలు, స్థల వివాదం నేపథ్యంలో జరిగిన ఘటన ఫ్యాక్షన్‌ హత్యలను తలపించింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌ గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్‌( 36), బుర్ర నవీన్‌ మధ్య కొద్దిరోజులుగా ఇంటి కొనుగోలు విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి శ్రీనివాస్‌, నవీన్‌ మధ్య గొడవ జరుగగా స్థానికులు కల్పించుకొని ఇరువురిని శాంతింపజేశారు. అయినా అర్ధరాత్రి సమయంలో నవీన్‌ తన అనుచరులతో కలిసి శ్రీనివాస్‌పైకి దాడికి పాల్పడగా అక్కడే ఉన్న వరుసకు సోదరుడైన దీటి మహేశ్‌ (38) అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపోద్రికుడైన నవీన్‌ తన అనుచరులతో కలిసి ఇరువురిపై కర్రలు, ఇనుపరాడ్‌లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడగా శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన మహేశ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించి చికిత్స చేస్తుండగా శుక్రవారం ఉదయం మృతిచెందాడు. శ్రీనివాస్‌కు భార్య, మహేశ్‌కు భార్య, నాలుగేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు.

ఏఎస్పీ పరిశీలన

గోపులాపూర్‌లో జరిగిన హత్య ఘటన స్థలాన్ని శుక్రవారం ఏఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ రామ్‌నర్సింహారెడ్డి, ఎస్సైలు శ్రీధర్‌రెడ్డి, ఉమాసాగర్‌, సతీశ్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్‌ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ప్రాణం తీసిన పాతకక్షలు
1/1

ప్రాణం తీసిన పాతకక్షలు

Advertisement
 
Advertisement
 
Advertisement