ముగ్గురు ‘ఉపాధి’ కూలీలకు గాయాలు - | Sakshi
Sakshi News home page

ముగ్గురు ‘ఉపాధి’ కూలీలకు గాయాలు

Published Sat, Apr 20 2024 1:45 AM

సంఘటన స్థలంలో బండరాయి - Sakshi

సుల్తానాబాద్‌రూరల్‌/సుల్తానాబాద్‌(పెద్దపల్లి):

ఉపాధిహామీ ద్వారా సుద్దాల పెద్దమ్మకుంటలో శుక్రవారం పూడికతీస్తున్న కూలీలపై బండరాయి దొర్లి, మట్టిపెళ్లలు పడ్డాయి. ఈఘటనలో ముగ్గురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దమ్మకుంట పూడికతీత పనుల్లో 163 మంది కూలీలు పనిచేస్తున్నారు. అందులో 20 మంది ఒక బృందంగా ఏర్పడి పూడిక తీస్తుండగా గట్టు కుంగి దానిపై ఉన్న బండరాయి కిందకు జారిపడింది. ఆ క్రమంలోనే మట్టిపెళ్లలు తగిలి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలు ఆవునూరి తార, కల్వల లింగమ్మ, బుర్ర స్వరూపకు గాయాలయ్యాయి. తోటికూలీలు వెంటనే సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచా రం అందుకున్న ఈజీఎస్‌ ఏపీడీ సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి కూలీలను పరామర్శించారు.

1/3

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుర్ర స్వరూప, ఆవునూరి తార, కాల్వల లింగమ్మ
2/3

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుర్ర స్వరూప, ఆవునూరి తార, కాల్వల లింగమ్మ

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement