పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

Published Sat, Apr 20 2024 1:45 AM

- - Sakshi

● ఓటింగ్‌శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు ● పార్లమెంటు నియోజకవర్గంలో 2,194 పోలింగ్‌ కేంద్రాలు ● ఎన్నికల విధులకు 5,500 మంది సిబ్బంది ● ‘సువిధ’కు వచ్చిన దరఖాస్తులు 168 ● తనిఖీల్లో రూ.7కోట్లు స్వాధీనం ● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్‌ ఎ న్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ నియోజకవర్గపరిధిలో 17,92,000 మంది ఓటర్లు ఉన్నారని, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు జిల్లాల పరిధిలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఉందని వెల్ల డించారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 50వేలు అధికంగా ఉండడం విశేషమని అన్నారు. 46,000 మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని, 13,200మంది 85ఏళ్ల పైబడిన వృద్ధులు ఉన్నారని తెలిపారు. 41,500 మంది దివ్యాంగులు ఉన్నారని, వీరి కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు.

8,552 ఈవీఎంలు.. 5,500 సిబ్బంది

ఎన్నికల్లో 8552 ఈవీఎంలు ఉపయోగిస్తున్నామని చెప్పారు. 2,194 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 5500 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. 85ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసేలా ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 12వేల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. శుక్రవారం వరకు 3 నామినేషన్లు దాఖలు అయ్యాయని, ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల గడువు ముగుస్తుందని, 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 68 ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. సువిధ పోర్టల్‌ ద్వారా సభలు, సమావేశాలు, ప్రచారానికి అనుమతుల కోసం 168 దరఖాస్తులు వచ్చాయని, దాదాపు 105 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. పోలీసు తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.7కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో అర్హులందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మీ కిరణ్‌, డీఆర్‌వో పవన్‌ కుమార్‌, సమాచార పౌరసంబంధాలశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ కొండయ్య, ఏపీఆర్‌ఓ వీరాంజనేయులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

కరీంనగర్‌/కరీంనగర్‌ అర్బన్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ ఓ టరు స్లిప్పులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సిబ్బందితో వెంట ఉండి ఓటరు జాబితాను చెక్‌ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో బెల్ట్‌షాపులు మూసివేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రాజకీయ పార్టీల నేతలు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరిస్తామని అన్నారు.

ఖర్చులపై ఫిర్యాదు చేయొచ్చు

కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల వ్యయ ఫిర్యాదులు సూచనలు, సలహాల కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్విని కుమార్‌ పాండే మొబైల్‌ నంబర్‌ 9032659531కు ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.ఎన్నికల ప్రక్రి య పూర్తి అయ్యే వరకు పరిశీలకులు జిల్లాలోనే ఉండి ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపా రు. కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ పమేలా సత్పతిని ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్‌ పాండే శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

ఈవీఎంల తరలింపులో జాగ్రత్తలు తప్పనిసరి

మొదటి ర్యాండమైజేషన్‌లో భాగంగా కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆయా నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూంలకు అప్రమత్తంగా తరలించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఈవీఎం గోదాంను సందర్శించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీ లించారు. ఈవీఎంల తరలింపులో ఎక్కడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement