కరీంనగర్: క్రిస్మస్ సందర్భంగా విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, క్రీడారంగాల్లో ఉత్తమసేవ, ప్రతిభ కనబరిచిన క్రైస్తవులు, సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఇందుకోసం ఈనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని, 30 ఏళ్లకు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ ఫారాలు మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ(మైనార్టీస్)ఫైనాన్స్ కార్పొరేషన్, కరీంనగర్ కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా కానీ లేదా www. tscmfc. in వెబ్‌సైట్‌లో నుంచి అయినా పొందవచ్చని తెలిపారు. పూర్తిచేసిన నామినేషన్లను సంబంధిత జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈనెల 15 తేదీ వరకు అందజేయవచ్చునని పేర్కొన్నారు. వివరాలకు 99897 27382 నంబరును సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.