ఆన్‌లైన్‌ విద్యుత్‌ సేవలపై శిక్షణ | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ విద్యుత్‌ సేవలపై శిక్షణ

Published Sun, Nov 19 2023 1:30 AM

మాట్లాడుతున్న జీఎం మనోహరస్వామి
 - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల సర్కిళ్ల పరిధిలోని జూనియ ర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూని యర్‌ అసిస్టెంట్లకు ఆన్‌లైన్‌ విద్యుత్‌ సేవలపై శని వారం శిక్షణనిచ్చారు. కరీంనగర్‌ విద్యుత్‌ భవన్‌ ఆవరణలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులను కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ వి.గంగాధర్‌ ప్రారంభించి, మాట్లాడారు. ఉద్యోగులు నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా విధుల్లో చురుగ్గా రాణించవచ్చన్నారు. అడ్మినిస్ట్రేషన్‌, ఎంకై ్వరీ, క్రమశిక్షణ చర్యలు, ఆన్‌లైన్‌ అకౌంట్స్‌, రెవెన్యూ, ఖర్చులు, కార్యాలయ నిర్వహణపై వరంగల్‌ జీఎం మనోహరస్వామి, ఏవో నాగేశ్వర్‌రావు అవగాహన కల్పించా రు. డీఈలు విజయేందర్‌ రెడ్డి, రాజం, తిరుపతి, ఏ డీఈలు, ఎస్‌ఏవో రాజేశం, ఏవోలు అరవింద్‌, రాజే ంద్రప్రసాద్‌, పీవో చంద్రయ్య తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement