మండల పరిషత్తు సమావేశం వాయిదా | Sakshi
Sakshi News home page

మండల పరిషత్తు సమావేశం వాయిదా

Published Thu, Nov 16 2023 6:12 AM

విద్యార్థులను అభినందిస్తున్న యాజమాన్యం
 - Sakshi

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. బుధవారం ఉదయం 11గంటలకు ఎంపీపీ టి.లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించాల్సిన సమావేశానికి ఎన్నికల నిర్వహణలో అధికారులు, ప్రచారంలో ప్రజాప్రతినిధులుండడంతో గైర్హాజరయ్యారు. సమావేశం నిర్వహణకు అవసరమైన ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు ప్రకటించారు.

విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ మరమ్మతు పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11కేవీ విద్యానగర్‌ ఫీడర్‌ పరిధిలోని విద్యానగర్‌, మామిడితోట, విజయదుర్గకాలనీ, సురక్ష టవర్‌ ప్రాంతాల్లో సరఫరా నిలిపేస్తున్నట్లు టౌన్‌2 ఏడీఈ ఎం.సుధీర్‌కుమార్‌ తెలిపారు.

ఫుట్‌బాల్‌ పోటీలో

విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్‌: 67వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా అండర్‌–14 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఈనెల 13న యైటింక్లయిన్‌ కాలనీలో నిర్వహించారు. నగరానికి చెందిన జాన్సన్‌, కోరా విద్యార్థులు సాయి శరణ్య, శ్రీహిత, శ్రీజ పాల్గొని మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. చైర్మన్‌ మహిపాల్‌రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్‌, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్‌రెడ్డి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పీఈటీ దుర్గరాజు, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం అభినందించింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement