ఫుట్‌బాల్‌ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక

Published Thu, Nov 16 2023 6:12 AM

వివరాలు సేకరిస్తున్న పోలీసులు  - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా జట్టుకు కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌ రెడ్డి తెలిపారు. గోదావరిఖనిలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌–14 బాలికల విభాగం పోటీల్లో పాఠశాలకు చెందిన బి.సహస్ర, ఎస్‌.నిసితాల్‌(ఎనిమిదో తరగతి), అండర్‌–14 బాలుర విభాగంలో కె.రిషిరెడ్డి(ఏడోతరగతి), పి.శ్రీ యాన్ష్‌, డి.శ్రేయాస్‌రాజ్‌(ఎనిమిదో తరగతి) లు ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. వారు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికవడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి, జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్‌, వ్యాయా మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లాడ్జీల్లో తనిఖీలు

జమ్మికుంట(హుజూరాబాద్‌): పట్టణంలోని పలు లాడ్జీల్లో సీఐ రమేశ్‌ ఆదేశాల మేరకు పోలీసులు బుధవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. గదుల్లో అద్దెకు దిగినవారి బ్యాగులు చెక్‌ చేశారు. లాడ్జీల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా అద్దెకు దిగేవారి వివరాలు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనుమానితులు, అపరిచితులు వస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఎస్‌ఐ లు శ్రీధర్‌, రాజేశ్‌, ఏఎస్‌ఐలు రాధాకిషన్‌, వెంకటేశ్వర్లు, రవి, సిబ్బంది పాల్గొన్నారు.

హార్వెస్టర్‌కు నిప్పు?

పాలకుర్తి(రామగుండం): పుట్నూర్‌ గ్రామంలోని రైతు నార సత్తయ్యకు చెందిన హార్వెస్టర్‌ను దుండగులు దహనం చేశారు. సత్తయ్య గ్రామశివారులోని తన పొలంలో మంగళవారం రాత్రి వరకూ వరికోశాడు. యంత్రాన్ని పొలంలోనే ఉంచి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా హార్వెస్టర్‌ ముందుభాగం పూర్తిగా కాలిపోయి ఉంది. రాత్రివేళ దుండగులు ఈదుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈవిషయంపై బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈఘటనలో దాదాపు రూ.10లక్షల నష్టం వాటిల్లినట్లు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

అభినందిస్తున్న చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి
1/2

అభినందిస్తున్న చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి

2/2

Advertisement
 

తప్పక చదవండి

Advertisement