ప్రచారానికి 12 రోజులే!

- - Sakshi

● ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ● అన్ని గ్రామాలను చుట్టేందుకు నేతల ఏర్పాట్లు ● చోటామోటా నాయకుల చేరికలపై నజర్‌ ● కరీంనగర్‌ జిల్లాలో 73 మంది అభ్యర్థులు

కరీంనగర్‌/సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలను చుట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ చోటామోటా నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునే పనిలో పడ్డారు. అసమ్మతి నాయకులను కలుపుకొని ముందుకుసాగుతున్నారు. నియోజకవర్గాల్లో పెద్ద నేతలను కలుస్తూ ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. ఐదు నుంచి పది వరకు ప్రచార రథాలకు అనుమతి తీసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల వాట్సాప్‌ గ్రూప్‌లలో సందడి చేస్తున్నారు.

28న ముగియనున్న ప్రచార గడువు

కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 73 మంది అభ్యర్థులు అసెంబ్లీ బరిలో నిలిచారు. కరీంనగర్‌లో 27 మంది, చొప్పదండిలో 14 మంది, మానకొండూరులో 10 మంది, హుజూరాబాద్‌లో 22 మంది పోటీలో ఉన్నారు. వీరికి అధికారులు గుర్తులను కేటాయించి, బ్యాలెట్‌ నమూనాను కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థులకు ప్రచార గడువు ఇంకా 12 రోజులే ఉంది. ఈ నెల 28న 5 గంటలకు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. 30న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న ఓట్లు లెక్కించనున్నారు.

అగ్రనేతలను రప్పించేందుకు సన్నాహాలు

కరీంనగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు తమ అగ్రనేతలను రప్పించి, బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టికెట్లు దక్కినివారు, పార్టీల్లో అసంతృప్తులు, కొన్నిచోట్ల సీనియర్‌ నేతలు ప్రచారానికి దూరంగా ఉండటంతో వారిపై దృష్టిసారించారు. ప్రచారంలో పాల్గొనేలా వారందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో ఇందుకోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులు నిత్యం మూడు నుంచి నాలుగు గ్రామాలు తిరిగేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉన్న కొద్ది సమయంలో అన్ని గ్రామాలను తిరగడం కష్టం. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు, కుటుంబసభ్యులు, బంధువులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రతీ మండల పరిధిలో కమిటీలు వేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డులు, డివిజన్లలోనే ఉండి, పనిచేసేలా సీనియర్‌ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనాలు, ప్రచార సామగ్రిని అందుబాటులో ఉంచుతూ ఇల్లిల్లు తిరగాలని కోరుతున్నారు.

నువ్వు యాడికెళ్తే.. ఆడికొస్త!

ఓవైపు పోలింగ్‌ గడువు దగ్గర పడుతోంది.. మరోవైపు చలికాలం.. ఈ రెండూ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రస్తుతం వరికోతలు జోరుగా సాగుతున్నాయి. చాలామంది ఆ పనుల్లోనే నిమగ్నమయ్యారు. మరికొందరు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో ఇంటి వద్ద ఎవరూ ఉండటం లేదు. దీంతో అభ్యర్థులు వారు పని చేస్తున్న చోటుకే వెళ్లి, ఓటు అభ్యర్థిస్తున్నారు. మిగతా చోట్ల ఉదయం 6 గంటలకే ప్రారంభించి, రాత్రి పొద్దుపోయేదాకా ప్రచారం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రహస్య మంతనాలు సాగిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామాల నుంచి ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తూ పోలింగ్‌ సమయానికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-11-2023
Nov 16, 2023, 11:24 IST
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి దండెం రాంరెడ్డి బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌...
16-11-2023
Nov 16, 2023, 11:24 IST
సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్‌ బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌, బీఎస్పీ అభ్యర్థులు...
16-11-2023
Nov 16, 2023, 10:49 IST
రోడ్‌ షోలు, బహిరంగ సభలు అత్యధికంగా నాంపల్లి నుంచి 34 మంది కంటోన్మెంట్‌ నుంచి అత్యల్పంగా 10 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇదీ పరిస్థితి ఎన్నికలకు...
16-11-2023
Nov 16, 2023, 10:46 IST
ఆదిలాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించిన గండ్రత్‌ సుజాత నిరాదరణకు గురయ్యారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ కంది...
16-11-2023
Nov 16, 2023, 10:37 IST
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో...
16-11-2023
Nov 16, 2023, 09:59 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని మాత్రం ఓ పాట ఆకర్షిస్తోంది. అన్ని...
16-11-2023
Nov 16, 2023, 09:38 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/జెడ్పీసెంటర్‌ /జడ్చర్ల/ దేవరకద్ర: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసెంబ్లీ...
16-11-2023
Nov 16, 2023, 08:28 IST
సాక్షి,ఆదిలాబాద్‌: ‘ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్ల లాంటివారు.. 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు లంబాడాలకు, ఆరు ఆదివాసీలకు...
16-11-2023
Nov 16, 2023, 07:25 IST
యాదగిరిగుట్ట రూరల్‌: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ– ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌న్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్‌ –జూబ్లీహిల్స్‌’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
వెంగళరావు నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మాత్రమే నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం...
16-11-2023
Nov 16, 2023, 06:14 IST
● అసెంబ్లీ ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ● ఆసిఫాబాద్‌లో 17 మంది.. సిర్పూర్‌లో 13 మంది ●...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
● బలం ఉన్న నాయకులపై ప్రధాన పార్టీల అభ్యర్థుల దృష్టి ● నిత్యం జంపింగ్‌లతో ప్రజల్లో అయోమయం ● ఉమ్మడి...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
● అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహించాలి ● ‘సాక్షి’తో విశ్రాంత ఉద్యోగులు ప్రజా ఎజెండా ఆసిఫాబాద్‌: ‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అర్హత...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
కరీంనగర్‌: పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో.. అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాజకీయాల్లోనూ పదవీ విరమణ ఉండాలి. పెరిగిన వయస్సు ఉద్యోగానికి పనికి రానప్పుడు రాజకీయాల్లో ఎలా పనికి...
16-11-2023
Nov 16, 2023, 06:10 IST
కరీంనగర్‌: నిజాం నిరంకుశ, రాచరిక పాలన, రజాకార్లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి, తెలంగాణ రైతాంగ సాయుధ...
16-11-2023
Nov 16, 2023, 06:08 IST
● జిల్లా ఎన్నికలాధికారి ఆశిష్‌ సాంగ్వాన్‌ నిర్మల్‌చైన్‌గేట్‌: కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌...
16-11-2023
Nov 16, 2023, 06:08 IST
● సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంఽఽథా రాష్ట్ర కార్యదర్శి సూర్యం పాతమంచిర్యాల: ఫాసిస్టు బీజేపీ, నియంతృత్వ బీఆర్‌ఎస్‌ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ...



 

Read also in:
Back to Top