ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు

Published Wed, Nov 15 2023 1:44 AM

ఆర్టీసీ సిబ్బందికి పరీక్షలు చేస్తున్న వైద్యురాలు - Sakshi

విద్యానగర్‌(కరీంనగర్‌): ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్‌–2 డిపో, కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ ఆవరణలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు షుగర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికులతో కలిపి మొత్తం 453 మందికి బీపీ చెక్‌ చేసి, పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.భూపతి రెడ్డి, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ (మెకానికల్‌) కె.సత్యనారాయణ, కరీంనగర్‌–2 డిపో మేనేజర్‌ వి.మల్లయ్య, పర్సనల్‌ ఆఫీసర్‌ ఎం.చంద్రయ్య, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పి.రజనీ కృష్ణ, వైద్యులు ఎం.విజయమోహన్‌ రెడ్డి, రఘురామన్‌, ఆర్‌.వెంకటేశ్వర్లు, పి.చైతన్య రెడ్డి, ఆర్టీసీ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎం.మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement