జాతీయస్థాయి పోటీలకు అల్ఫోర్స్‌ విద్యార్థి | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు అల్ఫోర్స్‌ విద్యార్థి

Published Tue, Nov 7 2023 1:10 AM

- - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): పంజాబ్‌ రాష్ట్రంలో నిర్వహించబోయే జాతీయ స్థాయి సెస్టోబాల్‌ టోర్నమెంట్‌కు కొత్తపల్లి అల్ఫోర్స్‌ ఇ– టెక్నో స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఎ.స్నేహిత్‌చంద్రారెడ్డి ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు పాఠశాలలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థికి అర్హతపత్రం అందించి అభినందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర సెస్టోబాల్‌ పోటీల్లో స్నేహిత్‌చంద్రారెడ్డి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. జాతీయస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు.

బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ కరీంనగర్‌ తిమ్మాపూర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌ ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ సంపత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులపాటు శిక్షణనిస్తామని, వసతి, భోజనంతోపాటు 2 డ్రెస్‌లు, టూల్‌ కిట్స్‌ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనతరం సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు. 10వ తరగతి చదివి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారు అర్హులని తెలిపారు. దరఖాస్తుకు పదోతరగతి మెమో, ఆధార్‌కార్డ్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌లు, 5 ఫొటోలు చేయాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు 99494 48157 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

రాజ్‌ఠాకూర్‌ వాహనం తనిఖీ

గోదావరిఖని: రామగుండం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ వాహనాన్ని పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. ఫైవింక్లయిన్‌సమీపంలో వన్‌టౌన్‌ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపి అందులోని సోదాలు చేశారు. వాహనంలో తనిఖీలు చేస్తున్నంత సేపు రాజ్‌ఠాకూర్‌ దూరంగా నిల్చొని పోలీసులకు సహకరించారు.

ఐదుగురి అరెస్ట్‌

మెట్‌పల్లి: పట్టణంలోని బస్‌ డిపో చౌరస్తాలో ముగ్గురిపై దాడికి పాల్పడ్డ ఐదుగురిని అరెస్ట్‌ చే సినట్లు ఎస్‌ఐ చిరంజీవి సోమవారం తెలి పారు. సాయిరాంకాలనీకి చెందిన కృష్ణ, సాగర్‌, సిద్దు ఆదివారం రాత్రి డిపో చౌరస్తాలో ఉండగా.. అక్కడికొచ్చిన ఇందిరానగర్‌కు చెందిన సాయి, రాములు, రాఘవ, భరత్‌, అజయ్‌ పా త గొడవలను దృష్టిలో ఉంచుకొని బండ రాళ్లతో దాడి చేశారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

1/1

Advertisement
 
Advertisement