శబరిమల యాత్రకు తక్కువ ఖర్చుతో ఆర్టీసీ సౌకర్యం
● కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్
దోమకొండ: శబరిమల యాత్రకు ఆర్టీసీ తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ అన్నారు. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ఆయన అయ్యప్ప మాలధారణ భక్తులతో మాట్లాడారు. ఆర్టీసీ నుంచి అయ్యప్ప దీక్షలో ఉన్న వారికి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సదుపాయం కల్పించినట్లు వివరించారు. ఇట్టి అవకాశంను అయ్యప్ప మాలధారణ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఛార్జీలు టోల్‌గేట్ రుసుము కూడా కలిసి ఉంటుందని, గురుస్వామి బస్సు బుక్ చేసినచో వారికి ప్రయాణ చార్జీ మినహాయిస్తామన్నారు. ఒకవేళ ఒకటి కన్న ఎక్కువ బస్సులు బుక్ చేసినచో రెండవ దానికి రోజుకు రూ.300 చొప్పన కమీషన్ ఇస్తామన్నారు. సీటింగ్ కెపాసిటీతో పాటుగా ఒక వంటమనిషి, ఇద్దరు మణికంఠ స్వాములు (10 సంవత్సరాల లోపు వారు) ఒక అటెండరును అనుమతిస్తామన్నారు. డిపో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, అయ్యప్ప స్వాములు బావి శరతచంద్రశర్మ, అయ్యప్ప ఆలయ కమిటి ప్రతినిధులు పాలకుర్తి శేఖర్, వెంకటేశం, వినోద్ ఉన్నారు.


