లారీ బోల్తా
మద్నూర్(జుక్కల్): మండలంలోని సలాబత్‌పూర్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున పత్తి లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి మద్నూర్ మీదుగా రాజస్థాన్‌కు పత్తి బేళ్ల లోడుతో వెళ్తున్న లారీ సలాబత్‌పూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా పడిందని డ్రైవర్ గోపాల్ మంగళవారం తెలిపారు. లారీ క్లీనర్ లోకేశ్‌కు గాయాలు కావడంతో స్థానిక దెగ్లూర్ ఆస్పత్రికి తరలించారు.
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ పరిధిలో ఉన్న రవీందర్‌గౌడ్ రైస్‌మిల్లులో 11 టన్నుల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రైస్ మిల్లుపై దాడి చేయగా మూడు వాహనాల్లో తీసుకొచ్చిన బియ్యాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏఎస్‌వో రవిరాథోడ్ వచ్చి వివరాలు సేకరిస్తున్నారని ఎస్సై తెలిపారు.


