స్వామియే శరణమయ్యప్పా!
భక్తి భావం పెరుగుతుంది
పూర్వజన్మ సుకృతం
● బాన్సువాడ నుంచి 16 సార్లు
శబరిమలకు పాదయాత్ర
● కఠిన నియమ, నిష్టలతో దీక్ష ఆచరణ
● రోజు రోజుకు పెరుగుతున్న భక్తి భావం
బాన్సువాడ: స్వామియే శరణం అయ్యప్పా.. అంటూ అయ్యప్ప నామస్మరణతో బాన్సువాడ ప్రాంతం మార్మోగిపోతుంది. ఈ ప్రాంతం అయ్యప్ప మాలధారణతో పాటు హనుమాన్, శివమాల, సరస్వతి దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష, భవానిమాత ఇలా రకరకాల మాలధారణలకు విశేష ఆదరణ పొందుతుంది.
కార్తీక మాసం నుంచి...
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్, పిట్లం తదితర ప్రాంతాల్లో అయ్యప్ప దీక్షలు చేపడుతున్నారు. కార్తీకమాసం నుంచి శబరిమలైలో జ్యోతి దర్శనంతో పాటు అయ్యప్ప పడి పూజ వరకు స్వాములు మాల ధరించి నల్ల, కాషాపు దుస్తువుల్లో దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు జిల్లాలో 4 వేలకు మందికిపైగా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు.
నియమావళిని పాటిస్తూ..
ప్రతీ ఏటా కన్య స్వాముల సంఖ్య పెరుగుతూ ఉంది. అయ్యప్ప మాల కఠినమైంది. ఖర్చుతో కూడుకున్నది. అయినా కూడా మాలధారుల సంఖ్య తగ్గడం లేదు. ఎముకలు కొరికే చలి ఉన్నా లెక్క చేయకుండా నియమావళిని పాటిస్తూ ఏటా కొత్తవారు దీక్ష స్వీకరిస్తున్నారు. ఒక్క బాన్సువాడ సన్నిధానంలోనే కన్య స్వాములు 40 మందికి మించి ఉన్నారు. 41 రోజుల దీక్షల అనంతరం ఇరుముడితో శబరిమల సన్నిధికి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. కొందరు గురుస్వాములు ఏళ్ల తరబడి మాలలు వేసుకుని శబరిమలకు వెళ్తున్నారు. చాలా మంది స్వాములు పాదయాత్రగా శబరికి చేరుకుంటారు.
గురుస్వామి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో..
బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి గురుస్వామి గురువినయ్‌కుమార్ ఆధ్వర్యంలో 16వ సారి పాదయాత్రగా శబరిమలకు తరలివెళ్లారు. కేరళలో ఉన్న శబరిమలకు ప్రతి రోజూ 20 నుంచి 30 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర 43 రోజులు కొనసాగుతుంది. సు మారు 1,600 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగు తుంది. పాదయాత్రలో 39 పడిపూజలు నిర్వహిస్తా రు. ఈ సారి 225 మంది అయ్యప్ప దీక్ష స్వాములు పాదయాత్రగా వెళ్లారు. ప్రతీసారి సుమారుగా 350 మంది వెళ్లేవారు. ప్రతీ ఏటా బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి స్వాములు పాదయాత్రగా వెళతారు. బాన్సువాడ అ య్యప్ప స్వాములు సోమవారం తెల్లవారుజామున శ బరిమలకు వెళ్లి దర్శనం పూర్తి చేసుకున్నారు. ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని శబరిమల వరకు కొనసాగుతుంది.
ఇళ్లల్లో పడి పూజలు
దీక్ష స్వీకరించిన స్వాములు తమ తమ ఇళ్లల్లో పడి పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబాలు బాగుండాలని, కోరికలు నేరవేరాలని గురుస్వాముల ఆధ్వర్యంలో ఇళ్లల్లో పడి వెలిగిస్తారు. పడి పూజల్లో తన్మయత్వంలో ఒకటవ మెట్టు శరణపున్నయ్యప్ప స్వామియే పున్నమయ్యప్ప అంటూ మొదటి మెట్టు నుంచి పద్దెనిమిదవ మెట్టు వరకు పడి వెలిగించి పరవశించిపోతారు. పడి వెలుగుల్లో స్వామి దింతనతోం..అయ్యప్ప దింతనతోం అంటూ పేటతూళ్తి ఆడుతారు. ఈ ఘట్టం ప్రతీ ఒక్కరిని రోమాలు నిక్కబోడిచేలా చేసి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది.
సన్నిధానంలో నిత్యాన్నదానం..
అయా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు సన్నిధానం ఏర్పాటు చేసుకుంటారు. ఆయా సన్నిధానాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తారు. దాతల సహకారంతో వేలాది అయ్యప్ప స్వాములు అన్నదానం చేస్తున్నారు. ఉదయం పాలు, పండ్లు, మధ్యాహ్నం భిక్ష (భోజనం), సాయంత్రం అల్పహార వితరణ చేస్తుంటారు.
మాలధారణతో భక్తి భావం పెంపొందుతుంది. ప్రతి స్వామి కార్తీకమాసం వచ్చిందంటే మాల వేయాల్సిందే. 26 ఏళ్లుగా అయ్యప్ప మాలధారణ చేస్తూ ధర్మరక్షణకు పాటుపడుతున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మాల వేయకుండా ఉండలేను. ఈ దీక్షతో భక్తి భావం పెరుగుంది. కన్యస్వాముల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది.
– గుడికొండ లింగం, గురుస్వామి, బీర్కూర్
అయ్యప్ప దీక్ష స్వీకరణ పూర్వ జన్మ సుకృతం. ఒక్క సారి దీక్ష చేపట్టిన వ్యక్తి తన ఒంట్లో సత్తా ఉన్నంతవరకు శ బరిమలని దర్శించుకుంటూ నే ఉంటాడు. మాలధారణ దీక్ష వేసుకుని 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు పాదయాత్రగా వెళతాం. ప్రతి రోజూ 20 నుంచి 30 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుంది. – గురువినయ్‌కుమార్, పాదయాత్ర
గురుస్వామి, బాన్సువాడ
స్వామియే శరణమయ్యప్పా!
స్వామియే శరణమయ్యప్పా!


