సైన్స్ ఎగ్జిబిషన్ స్థలం పరిశీలన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడి శివారులోని స్ప్రింగ్ ఫీల్స్ హైస్కూల్లో ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించే జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ స్థలాన్ని మంగళవారం డీఈవో రాజు పరిశీలించారు. ఎగ్జిబిషన్‌కు సంబంధించిన స్టాల్ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంఈవో యోసెఫ్, జిల్లా సైన్‌న్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ వీరభద్రప్ప, డైరెక్టర్లు గోపాల్ రెడ్డి, సీఆర్‌పీ నందు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లాకు చెందిన సఫల ఆర్గానిక్ కంపెనీ సీఈవో, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జపాన్‌లో పర్యటించారు. అక్కడ వ్యాపార, వాణిజ్య సంస్థల సీఈవోల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలను సమావేశంలో వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని అక్కడి కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ మేరకు జపాన్‌లోని అయిచికి రాష్ట్రంలోని అసెంబ్లీలో చైర్మన్ కుర్చీలో పైడి ఎల్లారెడ్డిని కూర్చోబెట్టి గౌరవించారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని కల్లు డిపోలలో మంగళవారం అబ్కారీ శాఖాధికారులు కల్లు శాంపిల్స్‌ను మంగళవారం సేకరించారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ సీఐ మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా కల్లు శాంపిల్స్‌ను సేకరించినట్లు తెలిపారు. ఏడాది కాలంగా భిక్కనూరులో 35 కల్లు శాంపిల్స్ సేకరించి అక్రమంగా అనుమతి లేకుండా ఉన్న 15 కల్లు దుకాణాలను సీజ్ చేసి 1,197 లీటర్ల కల్లును పారబోసి ఐదుగురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశామన్నారు. ఎస్సై దీపిక, హెడ్‌కానిస్టేబుల్ మోహినుద్దిన్, కానిస్టేబుల్ బాల్‌రాజు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఎగ్జిబిషన్ స్థలం పరిశీలన
సైన్స్ ఎగ్జిబిషన్ స్థలం పరిశీలన


