విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని తమ ప్రతిభను ప్రదర్శిస్తూ మందుకెళ్లాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు టాయిలెట్స్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేయాలని కాంగ్రెస్ నేత నాగిరెడ్డి కోరారు. తహసీల్దార్ అనిల్, ఎంఈవో ప్రవీణ్, ఎంపీడీవో అభినవ్ చందర్, కాంగ్రెస్ నాయకులు మోహన్, శామప్ప పటేల్, తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ తనిఖీ
మద్నూర్(జుక్కల్): విద్యార్థులు ఉన్నత శిఖరాల అధిరోహనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్‌ను సోమవారం రాత్రి ఎమ్మెల్యే తనిఖీ చేశారు. పాఠశాల క్యాంపస్‌లోని గదులను తిరిగి పరిశీలించారు. పాఠశాలలో ఏవైన సమస్యలు ఉన్నాయా అని ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలసుకున్నారు. పాఠశాలలో కిచెన్ షెడ్డు, ప్లే గ్రౌండ్ లేదని, అలాగే పలు సమస్యలున్నాయని ప్రిన్స్‌పాల్ వెంకట నర్సాగౌడ్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యన్నింటిని పరిష్కరిస్తామని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు.
రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు
నిజాంసాగర్ (జుక్కల్); ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అధికారులకు సూచించారు. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బీ శాఖాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.


