మౌలిక వసతుల పరిశీలన
కామారెడ్డి రూరల్: క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులను మంగళవారం జిల్లా స్వచ్ఛ పర్యవేక్షణ కమిటీ సభ్యులు నీలం లింగం పరిశీలించారు. పాఠశాలలో ఉన్న పచ్చదనం, పరిశుభ్రత, టాయిలెట్స్, తాగునీరు, కిచెన్ గార్డెన్, ట్రీ ప్లాంటేషన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు సదాశివుడు, శ్రీనివాస్, నర్సింలు, నర్సింలు, సవిత, చంద్రశేఖర్, మహేశ్వర్ గౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించనున్నట్టు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎం.చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. ఆసక్తిగల జిల్లా కవులు– పుస్తక ప్రాముఖ్యతపై కవితలు చదివి వినిపించాలని చైర్మన్ కోరారు. తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్, రచయిత రుద్రంగి రమేష్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఇళ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇళ్లు నిర్మించుకోని వారు ఉంటే లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారీగా ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు వారి ఖాతాలో డబ్బులు పడేలా చూడాలన్నారు. ఎంపీడీవో సాజీద్‌అలీ, సీనియర్ అసిస్టెంట్ హన్మాండ్లు, ఎంపీవో సవిత, తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల పరిశీలన


