అమ్మకు అక్షరమాల శిక్షణ
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం మండల సమాఖ్య ఆధ్వర్యంలో మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులకు, వీవోఏలకు అమ్మకు అక్షర మాలపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చదువురాని సభ్యుల కోసం ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వారు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో అక్షర వికాసం, చదువగలం, ఆదాయం పెంచుకుందాం, పోషకాహారం, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం, చట్టాన్ని తెలుసుకుందాం తదితర విషయాలపై మహిళ సంఘాల సభ్యులకు శిక్షణ అందించారు. ఏపీఎం జగదీశ్, మండల సమాఖ్య అధ్యక్షులు రేణుక, తదితరులున్నారు.


