అస్మిత అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులు
కామారెడ్డి అర్బన్: కేంద్ర క్రీడలు, యువజన శాఖ, స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో సోమవారం స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్ బై ఇన్‌స్పైరింగ్ విమెన్) అథ్లెటిక్స్ లీగ్–2025–26 విజయవంతమైంది. లీగ్‌లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని వివిధ అంశాల్లో ప్రతిభ చూపగా వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ప్రకటించి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర పరిశీలకులు స్వాములు, అశ్విని, జిల్లా క్రీడలు, యువజన అధికారి వెంకటేశ్వరగౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, ప్రతినిధులు నాగరాజు, దత్రాద్రి, శివాగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరాటేలో ప్రతిభ
కామారెడ్డి రూరల్: నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణంలో జరిగిన జేకేఏఐ అసోసియేషన్ నిర్వహించిన అంతరాష్ట్ర షోటఖాన్ కరాటే చాంపియన్‌షిప్–2025 పోటీలలో పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్(చిన్నమల్లారెడ్డి)కి చెందిన 8 మంది విద్యార్థినులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో అందే నిత్యశ్రీ, పాస్కంటి నిహారిక గోల్డ్ మెడల్స్, అలాగే అందే రితిక, రావుల హిమబిందు,పెట్టిగాడి మోక్షజ్ఞ, నస్కంటి మేఘవర్ణ సిల్వర్ మెడల్స్, రెడ్డి సహస్ర పరసబోయిన నిత్య మెరిట్ బహుమతిని సాధించినట్లు వెల్లడించారు. వీరిన ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు
పోటీలు
కామారెడ్డి అర్బన్: జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం విద్యార్థులకు పుస్తక పఠనం, అధ్యయనం, ప్రేరణాత్మక నినాదాలు, సృజనాత్మక పుస్తకం తయారీ అంశాలపై పోటీలు నిర్వహించారు. దేవునిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, వాగ్దేవి విద్యాలయం, సరస్వతి విద్యామందిర్, వాసవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
అస్మిత అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులు
అస్మిత అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులు


