మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
నిజామాబాద్‌అర్బన్: గల్ఫ్ పంపిస్తామని చెప్పి 80 మందిని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం సీపీ సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన దుండిగెల భూమేశ్, స్వప్న, అర్గుల భోజారాం కలిసి సుమారు 80 మందిని గల్ఫ్ పంపిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. రూ. 4 కోట్ల వసూలు చేసి దుబాయికి తీసుకెళ్లి అక్కడ 30 మందిపై మరోసారి క్రెడిట్ కార్డుల నుంచి లోన్లు తీయించుకొని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు. అనంతరం ఉపాధి కల్పించకుండా ఇండియాకు తిరిగి పంపించారన్నారు. దుబాయికి వెళ్లేందుకు వారికి ఇచ్చిన డబ్బులు మా పేరుపై తీసుకున్న క్రెడిట్ కార్డ్ లోన్ కలిపి మొత్తం రూ. పది కోట్ల వరకు నష్టపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే వీరిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. దుబాయిలో ఉన్న దుండిగల భూమేశ్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఇండియాకు రప్పించాలని బాధితులు వినతిపత్రంలో కోరారు.
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్కీత మాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరిదీపాలు, పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కంఠేశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవం తర్వాత 11 కోట్ల వత్తులను కాల్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శంభులింగేశ్వరాలయంలో ఆకాశ దీపారాధన, దీపోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి


