రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపునకు వస్తున్న ఆర్టీసీ బస్సు హాజీపూర్ వద్ద ప్రయాణికులను దించేందుకు నిలవగా లింగంపేట మండలంలోని ముంబోజిపేట గ్రామానికి చెందిన కాశీరాం(32) అనే వ్యక్తి ముంబోజిపేట నుంచి ఎల్లారెడ్డి వైపునకు బైక్‌పై వస్తుండగా నిలిచి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్నాడు. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్న లారీ
రెంజల్: మండలంలోని సాటాపూర్ సమీపంలో జాతీయ రహదారి డివైడర్‌ను సోమవారం తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు వెళ్తున్న లారీ ఢీకొన్నది. రహదారి పక్కనే నీటి గుంత ఉంది. లారీ డివైడర్‌లో ఇరుక్కుని నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


