ముగిసిన ఖోఖో వన్డే టోర్నమెంట్
నిజామాబాద్‌నాగారం: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జూనియర్స్ ఖో–ఖో వన్డే టోర్నమెంట్‌ను సోమ వారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ని ర్వహించారు. జూనియర్ విభాగంలో బాల, బాలికలకు పోటీలు జరిగాయి. బాలుర జట్టులో విన్నర్‌గా మైనారిటీ గురుకుల చందూర్, రన్నర్‌గా ధర్మారం బీసీ గురుకుల జట్టు నిలిచాయి. బాలికల జట్టులో విన్నర్‌గా కేజీబీవీ బాల్కొండ, రన్నర్‌గా పల్వంచ జెడ్పీ స్కూల్ నిలిచాయి. ప్రథమ, ద్వితీయస్థానంలో నిలిచిన విజేత జట్ల క్రీడాకారులకు బాలురకు ఈ నెల 19 నుంచి 26 వరకు కామారెడ్డి జిల్లాలోని ఉప్పల్‌వాయి గురుకుల పాఠశాలలో, బాలికలకు నందిపేట్‌లోని గీత కాన్వెంట్ స్కూల్‌లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేసి ఈ నెల 27 నుంచి 30వరకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరువులో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొననున్నారు. అనంతరం విజేత జట్లకు డీవైఎస్‌వో పవన్‌కుమార్, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్షుడు జీవీ భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అతీకుల్ల, ట్రెజరర్ నోముల మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి, రాము మోహన్‌రెడ్డి, సెక్రెటరీ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


