ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవం
బాన్సువాడ : బాన్సువాడ కమ్యూనిటీ మీడియేషన్ కార్యాలయంలో సోమవారం ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవం నిర్వహించారు. సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చిన సీనియర్ సిటిజన్ల కేసులను లీగల్ వాలంటీర్లు పరిష్కరించారు. సీనియర్ సిటిజన్ల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామని లీగల్ వాలంటీర్లు తెలిపారు. లీగల్ వాలంటీర్లు పుష్పవతి, అయ్యాల సంతోష్, అహ్మద్ హుస్సేన్, రామకృష్ణారెడ్డి, సాయిబాబా తదితరులున్నారు.
మద్నూర్(జుక్కల్): విద్యార్థులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని సఖి కేంద్రం అధికారి లావణ్య సూచించారు. డోంగ్లీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖీ కేంద్రం ఆధ్వర్యంలో బేటీ పడావో బేటీ బచావో, బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. సీ్త్ర, పిల్లల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు సందర్శించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మోహన్, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు సునీల్, తదితరులు పాల్గొన్నారు.


