బాధలు భరిస్తేనే బస్టాండ్‌ వైపు రండి..! | - | Sakshi
Sakshi News home page

బాధలు భరిస్తేనే బస్టాండ్‌ వైపు రండి..!

Nov 18 2025 6:01 AM | Updated on Nov 18 2025 6:01 AM

బాధలు

బాధలు భరిస్తేనే బస్టాండ్‌ వైపు రండి..!

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

కామారెడ్డి టౌన్‌ : ఏదైనా ఊరికి వెళ్లాలనుకునే వారు కామారెడ్డి బస్టాండ్‌కు వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్‌ ప్రాంగణంలోకి ప్రవేశం మొదలు బయటికి వెళ్లే వరకు అడుగడుగునా సమస్యలే..

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కామారెడ్డి కొత్త బస్టాండ్‌ రూపురేఖలు మారడం లేదు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్‌ను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి నుంచి బస్సులో ప్రతిరోజూ సుమారు 80వేల నుంచి లక్ష మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాండ్‌ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. బస్టాండ్‌ ప్రాంగణంలోని సీసీ రోడ్లు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. బస్సులు చెడిపోవడమే కాకుండా వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.ఈనెల 2వ తేదీన ఓ మహిళా కానిస్టేబుల్‌ ద్విచక్ర వాహనంపై బస్టాండ్‌ లోపలికి వెళ్తూ గుంతలో పడి గాయలపాలైంది. ఏడాదిన్నర కాలంగా ఉచిత మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండగా, మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. పే అండ్‌ యూజ్‌ మూత్రశాలలు, మరుగుదొడ్ల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్‌ఫామ్‌ర్పాటు చేసిన గడియారం పని చేయడం లేదు. ప్రధానంగా తాగు నీటి సౌకర్యం లేక ప్రయాణికులు గుక్కెడు నీటి కోసం తంటాలు పడుతున్నారు. ఎండకాలంలో సమస్య తీవ్రమవుతోంది. డీఎం కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్‌ షెడ్‌ ముందు సీసీ వేయకపోవడంతో దుమ్ముతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో బస్టాండ్‌ పైకప్పు ఊరవడంతోపాటు పెచ్చులూడుతున్నాయి.

సమస్యల వలయంలో

కామారెడ్డి బస్టాండ్‌

తాగునీటికి కటకట

మరుగుదొడ్లకు తాళాలు

ప్రాంగణమంతా గుంతలమయం

బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తా. తాగునీటి కోసం మున్సిపాలిటీ నుంచి కుళా యి కనెక్షన్‌ తీసుకున్నాం. శా శ్వతంగా తాగునీటి సమస్య ను పరిష్కరిస్తాం. ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటాం.

– దినేశ్‌కుమార్‌, డిపో మేనేజర్‌, కామారెడ్డి

బాధలు భరిస్తేనే బస్టాండ్‌ వైపు రండి..!1
1/1

బాధలు భరిస్తేనే బస్టాండ్‌ వైపు రండి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement