సోయా రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
మద్నూర్(జుక్కల్): సోయా కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా క్వాలిటీ ఇన్‌చార్జి రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో సోమవారం సోయా కొనుగోళ్లను నాఫెడ్ అధికారులు పునః ప్రారంభించారు. పంట దిగుబడిని పూర్తిగా సేకరిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని రాములునాయక్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సోయాలో క్వాలిటీ కచ్చితంగా ఉండాలని, దీనికి రైతులు సహకరించాలని ఆయన కోరారు. సోయాలో మట్టి పెల్లలు వస్తున్నాయని ఆయన సోయాను పరిశీలించి చెప్పారు. నాణ్యత ప్రకారమే సోయా కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. సొసైటీ, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో
భాగస్వాములు కావాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని సెట్రింగ్ శిక్షణ పొందిన వారికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 32 మందికి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికేట్‌లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శిక్షణ పూర్తి చేసుకున్న వారు యూనిట్‌లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం, రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ అధికారులకు సూ చించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మత్స్యశాఖ
అధికారిగా డోలీసింగ్
కామారెడ్డి క్రైం: జిల్లా మత్స్యశాఖ అధికారిగా డోలీసింగ్ నియమితులయ్యారు. కల్టెరేట్‌లో ని తన చాంబర్‌లో సోమవారం ఆయన బా ధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇదివరకు మత్స్య శాఖ అధికారిగా పనిచేసిన శ్రీపతి హన్మకొండకు బదిలీపై వెళ్లగా, నిజాంసాగర్ మత్స్య విత్తన క్షేత్రం ఇన్‌చార్జీగా ఉన్న డోలీసింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కే.జయరాజ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న ఒక్కో విద్యార్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద రూ.4వేలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సోయా రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
సోయా రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం


