● అర్ధరాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది
ఇబ్బందులను పరిశీలించిన ఎస్పీ
● సిబ్బందికి టీ, కాఫీ, వాటర్ బాటిళ్ల
అందజేత
సిబ్బందితో కలిసి టీ తాగుతున్న ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: గజగజ వణికిస్తున్న చలిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులను ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం అర్ధరాత్రి స్వయంగా పరిశీలించా రు. పట్టణంలోని సిరిసిల్లా రోడ్డు, రామారెడ్డి రోడ్డు, ఎల్లారెడ్డి రోడ్డు, ఇతర ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్ తదితర విధుల్లో ఉన్న సిబ్బంది ప్రాథమిక అవసరాలైన టీ, కాఫీ, వాటర్ బాటిళ్లను తన ఇంటి నుంచి తెప్పించి అందజేశారు. స్వయంగా ఎస్పీ తన ఇంటి నుంచి టీ, కాఫీ, వాట ర్ తెప్పించడం పోలీసు అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎస్పీ చూపించిన ఆదరాభిమానాలు తమలో నూతన ఉత్తేజాన్ని నింపాయనీ, మా మంచి పోలీస్ బాస్ అంటూ కామారెడ్డి పో లీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


