మంజీరా తీరాన వలస జీవాలు
గుడారాలు వేసి జీవిస్తున్నాం
మేత కోసం వలస వచ్చాం..
● పక్క జిల్లాల్లో గ్రాసం
కొరతతో వలసబాట
● పలు జిల్లాల నుంచి
మూగజీవాలతో పెంపకందారుల రాక
నిజాంసాగర్(జుక్కల్): మూగజీవాల పోషణ, పశుసంపదపై ఆధారపడిన రైతులు వాటి సంరక్షణ కోసం ఎల్లలు దాటి జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా పశుగ్రాసం, తాగునీటి కొరత ఉండటంతో జిల్లాలు దాటి జీవాలతో పాటు జీవన ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి వేలాదిగా మూగజీవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వలస వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో మూగజీవాలకు పశుగ్రాసం కొరత కారణంగా గొర్రెలు, ఆవుల మందలతో రైతులు వలసబాట పట్టారు. గొర్రెల మందలతో పాటు పశువుల మందలు పంట పొలాల్లో సందడి చేస్తున్నాయి. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచి దాదాపు లక్ష నుంచి 2 లక్షల వరకు గొర్రెలు వలస వచ్చాయి. అంతేకాకుండా మిగితా జిల్లాల నుంచి వేలాదిగా గొర్రెలు, గోజాతి పశువులతో రైతులు వలస వచ్చారు.
పంట నూర్పిళ్లు పూర్తవడంతో..
జిల్లాలోని నిజాంసాగర్,ఎల్లారెడ్డి,నాగిరెడ్డిపేట, బా న్సువాడ,పిట్లం,బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని మంజీరా నది తీర ప్రాంత వ్యవసాయభూముల్లో వలస జీవాలు సందడి చేస్తున్నాయి. ఆయా మండలాల్లో వానాకాలం పంట నూర్పిళ్లు పూర్తవడంతో పశువులతో పాటు గొర్రెలకు పశుగ్రా సం పుష్టిగా లభిస్తోంది. అంతేకాకుండా ఆయా గ్రా మాలు,మండలాల్లోని చెరువులు, కుంటల్లో నీటి ని ల్వలు నిండుకుండలుగా ఉండటం, వాగులు ప్రవహిస్తుండటంతో మూగజీవాలకు తాగునీరు లభిస్తోంది. దీంతో మూగజీవాల పోషణను నమ్ముకున్న రైతులు జీవాలతోపాటు పంటపొలాల్లో మకాం వేస్తున్నారు. గ్రామ శివారు ప్రాంతాల్లోని పంట పొలాల్లో జీవాల మందను పెడుతున్నారు. పంట పొలాల్లో జీవాల సంచారంతో సేంద్రియ ఎరువులు లభిస్తున్నాయి. జీవాల మందలకు అనుగుణంగా పాడి పశువుల పోషకులకు డబ్బులు చెల్లిస్తుండటంతో రైతులకు గ్రాసం లభిస్తోంది.
మా ప్రాంతం పంటల్లేక అంతా ఎడారిని తలపిస్తోంది. మూగజీవాలకు పశుగ్రాసం లభించక వాటి సంరక్షణ కోసం వలస వచ్చాం. నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు చుట్టుపక్క మండలాల్లో గొర్రెలు, పశువులతోపాటు గుడారం వేసుకుంటున్నాం. ఇక్కడ జీవాలకు గ్రాసంతోపాటు మాకు పోషణ కూడా లభిస్తోంది. – సాయికుమార్, సంగారెడ్డి జిల్లా
మాకక్కడ జీవాలకు మేత దొరకక ఇక్కడికి జీవాలను తీసుకువచ్చాం. గొర్రెలు, మేకలకు గ్రాసంతో పాటు తాగునీటి కొరత ఉంది. మా ఊరి నుంచి నెలన్నర కిందట బయలు దేరినం. ఇక్కడ గొర్రెలు, మేకలకు మేతతో పాటు తాగు నీరు పుష్కలంగా లభిస్తోంది.
–కుర్మ మల్లయ్య, పాలమూరు జిల్లా
మంజీరా తీరాన వలస జీవాలు
మంజీరా తీరాన వలస జీవాలు
మంజీరా తీరాన వలస జీవాలు


