‘టీజీఎన్‌పీడీసీఎల్’లో డిజిటల్ సేవలు
సుభాష్‌నగర్: వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకొని డిజిటల్ సేవలు అందిస్తున్నామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌ను రూపొందించామని, 20 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఐ ఫోన్‌లో ప్లే, యాప్‌స్టోర్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ అని టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని సేవలు పొందాలని ఆయన సూచించారు. నెలవారీ విద్యుత్ బిల్లులను యాప్, టీ వ్యాలెట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ ఫ్లాట్‌పారాల ద్వారా చెల్లించే సదుపాయం కల్పించామని రవీందర్ తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్ వెబ్‌సైట్ ద్వారా కన్జ్యూమర్ గ్రీవెన్స్ పోర్టల్, కొత్త సర్వీస్ కనెక్షన్, సోలార్, హెచ్‌టీ లైన్ షిఫ్టింగ్, హెచ్‌టీ కన్జ్యూమర్ పోర్టల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆన్‌లైన్ ఎస్టిమేట్ డిమాండ్ నోటీస్ చార్జీలు, తదితర సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరెంట్ బిల్లు సమాచారం, బిల్లు చెల్లింపు వివరాలు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదించాలని ఎస్‌ఈ రవీందర్ సూచించారు.


