చికిత్స పొందుతూ ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఒకరి మృతి

Nov 17 2025 8:34 AM | Updated on Nov 17 2025 8:34 AM

చికిత

చికిత్స పొందుతూ ఒకరి మృతి

చికిత్స పొందుతూ ఒకరి మృతి యువకుడి అదృశ్యం మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌ దాడి చేసిన వారిపై కేసు నమోదు

తాడ్వాయి: మండలంలోని దేవాయిపల్లి గ్రామానికి చెందిన మండల యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. ఎస్సై ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. దేవాయిపల్లి గ్రామానికి చెందిన కురుమ సతీశ్‌(29) ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఉదయం పురుగు మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా అపస్మారక స్థితిలో ఉన్న సతీశ్‌ను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

ముబారక్‌నగర్‌లో మరొకరు..

నిజామాబాద్‌ రూరల్‌: మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం పురుగులమందు తాగగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముబారక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అంబటి గణేశ్‌(64)కు రెండేళ్లుగా మతిస్థిమితం సరిగా లేదు. మూడు రోజుల క్రితం ఇంట్లో వింతవింతగా ప్రవర్తించి పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబీకులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వేల్పూర్‌: మండలంలోని అక్లూర్‌ గ్రామానికి చెందిన గంగం అనిందర్‌రెడ్డి(29) అనే వ్యక్తి ఈనెల 3 నుంచి అదృశ్యమైనట్లు ఎస్సై సంజీవ్‌ ఆదివారం తెలిపారు. ఈనెల 3న ఆర్మూర్‌కు బ్యాంకు పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అతని తండ్రి గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

లింగంపేట: మండలంలోని పర్మళ్ల, లింగంపేట గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. లింగంపేట శివారులోని పెద్దవాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌, పర్మళ్ల శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పీఎస్‌కు తరలించామన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

డిచ్‌పల్లి: మండలంలోని రాంపూర్‌ గ్రామంలో ఈనెల 13న జరిగిన పెళ్లి భారత్‌లో అదే గ్రామానికి చెందిన సుభాష్‌, నర్సింగ్‌పూర్‌ గ్రామానికి చెందిన నల్ల నితీశ్‌లకు గొడవ జరిగింది. దీనిని మనసులో పెట్టుకొని 14న సాయంత్రం నల్ల నితీష్‌, సుభాష్‌కు ఫోన్‌ చేసి రాంపూర్‌లోని గురుకుల పాఠశాల వద్దకు రమ్మని పిలిచాడు. దీంతో సుభాష్‌ తన స్నేహితులైన రాకేశ్‌, రఘు, సతీశ్‌లను వెంటబెట్టుకొని వెళ్లాడు. అక్కడ సిద్ధంగా ఉన్న నితీశ్‌ అతని మిత్రులు నల్ల విఘ్నేశ్‌, షేక్‌ సోహైల్‌, నల్ల సాయివర్ధన్‌, మహమ్మద్‌ ఆరిఫ్‌, నీరడి తరుణ్‌ కర్రలు, రాడ్‌లతో సుభాష్‌తోపాటు అతని స్నేహితులపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. అదే సమయంలో రాంపూర్‌ గ్రామస్తులు అక్కడికి రావడంతో నితీశ్‌ అతని స్నేహితులు పారిపోయారు. సుభాష్‌ తల్లి నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డిచ్‌పల్లి ఎస్సై షరీఫ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి
1
1/1

చికిత్స పొందుతూ ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement