● అ‘పూర్వ’ సమ్మేళనం
జక్రాన్‌పల్లి/పెర్కిట్: జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత అందరూ ఒకేచోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువులను ఆహ్వానించి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రమేశ్, శ్రీనివాస్, దయాకర్, లింగం, నరేశ్, పెరుగు రమేశ్, బాదవత్ రమేశ్, గంగాధర్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మిర్దాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 2000–01 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో సౌడ సురేశ్, జంపల జగదీశ్, రవి, నవీన్, లక్ష్మి, పరిమల తదితరులు పాల్గొన్నారు.
● అ‘పూర్వ’ సమ్మేళనం


