పిన్‌కోడ్ నంబర్‌తో గ్రామాన్ని ఎలా గుర్తిస్తారు?
మీకు తెలుసా?
రామారెడ్డి: భారతదేశంలో పిన్ కోడ్ (పోస్టల్ ఇండెక్స్ నంబర్) ఆధారంగా ఒక గ్రామాన్ని లేదా ప్రాంతాన్ని ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం. పిన్ కోడ్ అనేది ఇండియా పోస్ట్ (భారతీయ తపాలా శాఖ) ఉపయోగించే ఆరు అంకెల సంఖ్య. దీని ముఖ్య ఉద్దేశం తపాలా సేవలను క్రమబద్దీకరించడం. దేశంలో ఒకే పేరు గల ప్రాంతాల మధ్య గందరగోళాన్ని నివారించడం.
● ప్రతి పిన్ కోడ్‌ను ఒక నిర్ధిష్టమైన పోస్టాఫీసుకు కేటాయిస్తారు. ఈ పోస్టాఫీసు పరిధిలో ఆ చుట్టుపక్కల ఉండే పట్టణాలు, గ్రామాలు, ప్రాంతాలు వస్తాయి. అందువలన ఒక గ్రామం పిన్ కోడ్ తెలిస్తే, ఆ గ్రామం ఏ పోస్టాఫీసు పరిధిలోకి వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు.
● ఆరు అంకెల పిన్ కోడ్ ఒక్కొక్కటి ఒక నిర్ధి ష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది.
● పిన్ కోడ్ ద్వారా ఒక గ్రామాన్ని పరోక్షంగా గుర్తిస్తారు.
● నిర్ధిష్ట పోస్టాఫీసు పిన్ కోడ్‌లోని చివరి మూడు అంకెలు ఆ ప్రాంతంలోని ఒక నిర్ధిష్ట డెలివరీ పోస్టాఫీసును సూచిస్తాయి.
● గ్రామ పరిధి ప్రతి పోస్టాఫీసు దాని చుట్టూ ఉన్న అనేక గ్రామాలు, కాలనీలు లేదా చిన్న పట్టణాలకు మెయిల్ డెలివరీ చేస్తుంది. ఈ గ్రామాలన్నీ ఒకే పిన్ కోడ్ పరిధిలోకి వస్తాయి.
● ప్రత్యేకత(యూనిక్ నెస్) ఒకే పిన్ కోడ్‌లో అనేక గ్రామాలు ఉన్నా ప్రతి గ్రామానికి పోస్టాఫీసు రికార్డుల్లో ప్రత్యేక చిరునామా ఉంటుంది. అయితే, పిన్ కోడ్ అనేది పోస్టాఫీసు స్థానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటుంది.
● ఆ పోస్టాఫీసు డెలివరీ చేసే అన్ని గ్రామాలు ఆ ప్రత్యేక పిన్ కోడ్‌ను పంచుకుంటాయి.


