కరెంట్‌షాక్‌తో గేదె మృతి
కామారెడ్డి రూరల్: పొలంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఓ పాడి గేదె మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్యామ్‌రావు రోజులాగే తన పొలంలో మేత కోసం పాడిగేదెను వదిలాడు. గేదె ఒక్కసారిగా అరవడంతో గమనించిన శ్యామ్‌రావు గేదెకు విద్యుత్‌తీగలు తగిలినట్లు గుర్తించి వెంటనే ఓ కర్రసాయంతో తొలగించాడు. అప్పటికే గేదె మృతి చెందింది. ఇంట్లో పిల్లలాగా చూసుకున్నామని, మరో నెల అయితే దూడకు జన్మనిస్తుంటే అని రైతు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అధికారులు స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.
కుక్కల దాడిలో ఐదు గొర్రె పిల్లలు..
మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో కుక్కల దాడిలో చెట్కూరి సాయిలుకు చెందిన ఐదు గొర్రె పిల్లలు మృతిచెందాయి. సాయిలు గొర్రె పిల్లలను కొట్టంలో ఉంచి, గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం వీధి కుక్కలు కొట్టంలో ఉన్న గొర్రె పిల్లలపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఇందులో ఐదు గొర్రెపిల్లలు మృతి చెందాడు. అలాగే కొట్టంలో ఉన్న లేగ దూడపై సైతం దాడి చేస్తుండగా పొలానికి వెళ్తున్న కొందరు రైతులు గమనించి కుక్కలను తరిమికొట్టారు. దాడిలో లేగ దూడకు తీవ్ర గాయాలయ్యాయి. రూ.40 వేల నష్టం సంభవించిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
కరెంట్‌షాక్‌తో గేదె మృతి


