సమాజాన్ని కళలు ప్రభావితం చేస్తాయి
తెయూ(డిచ్‌పల్లి): సమాజాన్ని కళలు తీవ్రంగా ప్ర భావితం చేస్తాయని, కళాకారులు తమ కళారూపా ల ద్వారా చైతన్యవంతంగా ప్రజల హృదయాలను తట్టి లేపుతారని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రా ర్ యాదగిరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో శ నివారం వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి అధ్యక్షతన రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి స భ్యులు పల్లె నర్సింహ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా కళాకారులు ‘ఎంజాయ్ పేరు తో గంజాయి’ అనే అంశంపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి రిజిస్ట్రార్ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలో నిర్మాణాత్మక మార్పునకు కృషి చేయాలన్నారు. డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్‌ఐ షరీఫ్ మాట్లాడుతూ.. యువత గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం గంజాయి వల్ల కలిగే నష్టాలను కళాకారుల బృందం ఆటపాటలు, నాటికల ద్వారా వివరించా రు. తెయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, తెలంగాణ ప్రజా నాట్యమండలి అధ్యక్షుడు శ్రీనివాస్, పీఆర్‌వో పున్నయ్య పాల్గొన్నారు.


