ఇసుక టిప్పర్ పట్టివేత
రెంజల్(బోధన్): నీలా శివారులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను శనివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. బోధన్ మండలం హంగర్గా నుంచి రెంజల్ మండలం నీలా గ్రామం మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా టిప్పర్‌ను పట్టుకున్నామన్నారు. టిప్పర్ యజమాని ఇశ్రార్‌ఖాన్, డ్రైవర్ మహ్మద్‌లుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశామన్నారు.
కరెంట్‌షాక్‌తో ఆవు మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెల్లకుంటతండాలోని కొర్ర రాంజీకి చెందిన ఆవు కరెంట్ షాక్‌తో మృతిచెందింది. రాంజీకి చెందిన ఆవులమంద మేత కోసం శనివారం మాచాపూర్ శివారుకు వెళ్లగా, ఓ ఆవు విద్యుత్‌స్తంభానికి తగిలి కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. కరెంటు తీగలు బయటకు తేలడంతోనే ప్రమాదం జరిగిందని తండావాసులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని తండావాసులు తెలిపారు.


