అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
రుద్రూర్: మండలంలోని ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సాయి ప్రసాద్‌కు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఇటీవల సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఐఎస్‌ఆర్‌హెచ్‌ఈ ఆధ్వర్యంలో భారత్ శ్రీరత్నం సమ్మాన్–2025 కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న 79 మందిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును సాయిప్రసాద్ అందుకున్నారు.


