డాక్టర్స్ కాలనీలో చోరీ
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. వివరాలు ఇలా.. కాలనీకి చెందిన గురుచరణం అనే వ్యక్తి గత నెల 29న తన ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో కలసి విదేశాలకు వెళ్లారు. 31న వారి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం పోలీసులు ఇంటి యజమానికి సమాచారం అందించగా వారు శనివారం ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని రూ.2వేల నగదు, 500 గ్రాముల వెండి, 16 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు.


