‘సమాజంపై తనదైన ముద్ర వేసిన వట్టికోట’
కామారెడ్డి అర్బన్: తెలంగాణ కమ్యూనిస్టునేతగా, ప్రచురణకర్త, ప్రతికారంగంతో పాటు ప్రజా సాహిత్యోద్యమ పితామహుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి సమాజంలో తనదైన ముద్ర వేశారని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కే విజయ్‌కుమార్ అన్నారు. శనివారం వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు జయప్రకాష్, శ్రీనివాస్‌రావు, రవికుమార్, మల్లేష్, అంజనేయులు,మహేష్, తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ కిసాన్‌విభాగం ఉపాధ్యాక్షుడు కుంట లింగారెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులను మంజూరు చేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండీ ముజిబొద్దీన్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలకు మొదటి విడత 50 శాతం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ను విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. నిధులను విడుదల చేసినట్టు ఉత్తర్వులను విడుదల చేసినప్పటికీ పాఠశాలల ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాండ్రె శ్రీనివాసులు ఉన్నారు.
నిజామాబాద్ నుంచి
నిజామాబాద్ సిటీ: కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ నుంచి అరుణాచలం వరకు సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో–1 మేనేజర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు బస్సు నిజామాబాద్ బస్టాండ్ నుంచి బయల్దేరుతుందన్నారు.
‘సమాజంపై తనదైన ముద్ర వేసిన వట్టికోట’
‘సమాజంపై తనదైన ముద్ర వేసిన వట్టికోట’


